![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ మెగా చీఫ్ కోసం జరుగుతున్న టాస్క్ లో నబీల్ యష్మీ, ప్రేరణ, పృథ్వీ, రోహిణి లు కంటెండర్స్ గా ఉన్నారు. అయితే టాస్క్ ఏంటంటే 'మూట ముఖ్యం'. ఈ టాస్క్ లో కంటెండర్స్ తమ కి కేటాయించిన కంటైనర్స్ లో కూర్చొని ఉంటారు. ఎవరు మెగా చీఫ్ వద్దని అనుకుంటున్నారో వాళ్ళ మూటలు ఎక్కువగా కంటైనర్ లో వెయ్యాలి. కంటైనర్ లో ఉన్న మూటలు కూడా తియ్యొచ్చు దానికి సంచాలకుడిగా అవినాష్ ఉన్నాడు.
అలా మొదటి బజర్ కి అందరు యష్మీ కంటైనర్ లో మూటలు వేస్తారు. అలాగే నిఖిల్ బయటకు తీస్తున్నాడు. నబీల్ కంటైనర్ లో హరితేజ ఎక్కువగా వేస్తుంటే అవినాష్, గౌతమ్ లు తీసేస్తున్నారు. ఇలా మొదట బజర్ కి యష్మీ అవుట్ అఫ్ ది టాస్క్ అవుతుంది. మిగతా హౌస్ మేట్స్ అంటే ఒక గౌతమ్, అవినాష్ తేజ తప్ప అందరూ కూడా ఈ సారీ నబీల్ ని తప్పించాలని మాట్లాడుకుంటారు. హరితేజకి నబీల్ అంటే ఎందుకు కోపమో తెలియదు కానీ నబీల్ ని తీసేయాలని అంటుంది. అలా రెండవ బజర్ కి అందరు నబీల్ ని టార్గెట్ చేస్తారు. ముఖ్యంగా హరితేజ, నిఖిల్ , యష్మీ, విష్ణుప్రియ కలిసి నబీల్ ని టార్గెట్ చేశారు. వాళ్ళు కంటైనర్ లో మూటలు వేస్తుంటే గౌతమ్, అవినాష్ లు తీసేస్తుంటారు. ఇక నబీల్ కంటైనర్ లో ఎక్కువ మూటలుంటాయి. తనే అవుట్ అఫ్ ది టాస్క్ అవుతాడు.
నబీల్ బయటకు వచ్చి.. చాలా థాంక్స్ నిఖిల్ణ యష్మీ, హరితేజ, విష్ణుప్రియ అని చెప్తాడు. ఇక రివెంజ్ స్టోరీ స్టార్టెడ్ అని హరితేజ ఇంకా రెచ్చగొట్టేల మాట్లాడుతుంది. దాంతో నబీల్ పక్కకు వెళ్లి.. రివెంజ్ స్టోరీ ఏంటి? నాకు సపోర్ట్ చేస్తే చేస్తాను.. లేదంటే చెయ్యనని నబీల్ అంటాడు. ఆ తర్వాత అవినాష్ తేజ, నబీల్ లు మాట్లాడుకుంటారు. నబీల్ ని అందరు ఇలా కొట్టేస్తున్నారు.. టార్గెట్ చేశారని అవినాష్ అంటాడు.
![]() |
![]() |